ఎక్కడికి వెళ్ళినా తనపై ఎవరో ఒకరు ఏదో ఒకరకంగా దాడి చేస్తారేమోనని ఇప్పటికీ భయం వేస్తుందట అడల్ట్ స్టార్ సన్నీలియోన్‌కి. అడల్ట్ సినిమాలు చేసి, బాలీవుడ్ తారగా మారిన సన్నీలియోన్, బాలీవుడ్ కెరీర్ చాలా హ్యాపీగా సాగుతోందనీ, అయితే పబ్లిక్‌లోకి వెళ్ళేటప్పుడు, తనను అడల్ట్ స్టార్ అనే కోణంలో చూసి, ఎవరైనా ఏమన్నా అంటారేమోననీ, దాడులు చేస్తారేమోనన్న భయం తనకు ఇంకా పోలేదని సన్నీలియోన్ చెప్పుకొచ్చింది.
పుట్టి పెరిగిన కల్చర్ తనను అడల్ట్ సినిమాల వైపు తీసుకెళ్ళిందనీ, ఇండియాకి వచ్చాక.. తాను ఇండియన్ ట్రెడిషన్‌లో ఒదిగిపోయాననీ, పూర్వపు అడల్ట్ కెరీర్ పట్ల రిగ్రెట్స్ లేకపోయినా, ఇకపై అలాంటివి చేయడం లేదా వాటిని ప్రోత్సహించడం చేయబోనని సన్నీలియోన్ తేల్చి చెప్పింది.
అవకాశాలతోపాటే అడపా దడపా వివాదాలూ తనకు ఎదురవుతున్నా, ఆడియన్స్ తనను ఆదరిస్తుండడంతో వివాదాలు మర్చిపోతున్నానంటోన్న సన్నీలియోన్, నటనలో డాన్సుల్లో చాలా పరిణతి సాధించాననీ, మొదట్లో బాలీవుడ్ సినిమాలు తనకు సరిపడవేమోనని అనుకున్నా, ఇప్పుడు తనకు ఏ ఇబ్బందీ లేదని చెబుతోంది.