చరణ్ కు వేరే ఆప్షన్ లేదా?

ఆగడు రిజల్ట్ చూసి, రామ్ చరణ్ –శ్రీను వైట్ల సినిమా డ్రాప్ అవుతుందన్న వార్తలు వినవచ్చాయి. కానీ ఇప్పుడు ఆలోచిస్తే రామ్ చరణ్ కు అంతకన్నా ఆప్షన్ ఏముందన్న డిస్కషన్ లు వినిపిస్తున్నాయి. మొన్నటికి…

ఆగడు రిజల్ట్ చూసి, రామ్ చరణ్ –శ్రీను వైట్ల సినిమా డ్రాప్ అవుతుందన్న వార్తలు వినవచ్చాయి. కానీ ఇప్పుడు ఆలోచిస్తే రామ్ చరణ్ కు అంతకన్నా ఆప్షన్ ఏముందన్న డిస్కషన్ లు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్నే వినాయక్ తో చేసాడు. పూరి ఎప్పుడో దూరమయ్యాడు..బొయపాటి కథలు నచ్చలేదు. కొరటాల శివ ఖాళీ లేడు..సుకుమార్, క్రిష్, కట్టాదేవా మాస్ డైరక్టర్లుకు కాస్త అటు ఇటుగా వున్నారు..ఇలా అందరికీ ఏదో ఓ సమస్య. 

కానీ శ్రీనువైట్ల ఆగడు విషయంలో తప్పటడుగు వేసి వుండొచ్చు కానీ, తీసి పారేయాల్సిన వాడేమీ కాదు. అందునా ఇప్పుడు దెబ్బతిన్న పులి. అలాంటివాడిని సరైన ట్రాక్ లో వాడుకుంటే గురి కొట్టేయచ్చు. ఎలాగా చిరంజీవి అనుభవం, అరవింద్ మేనేజ్ మెంట్ వెనకాల వుండనే వుంటాయి. అందుకనే ఈ కాంబినేషన్ క్యాన్సిల్ కాదని, ముందుకే వెళ్తుందని అంటున్నారు.