పవన్‌కళ్యాణ్‌జీ.. మార్చేయండి ప్లీజ్‌!

‘గోపాల గోపాల’ చిత్రంలో ‘గబ్బర్‌సింగ్‌ 2’ చిత్రంలో కథానాయికగా ఎంపికైన అనీషా ఆంబ్రోస్‌ చిన్న పాత్రలో కనిపించింది. వెంకటేష్‌ని ‘బోనులో భగవంతుడు’ షోలో ఇంటర్వ్యూ చేసే జర్నలిస్ట్‌ మరెవరో కాదు.. గబ్బర్‌సింగ్‌కి జోడీ కట్టబోతున్న…

‘గోపాల గోపాల’ చిత్రంలో ‘గబ్బర్‌సింగ్‌ 2’ చిత్రంలో కథానాయికగా ఎంపికైన అనీషా ఆంబ్రోస్‌ చిన్న పాత్రలో కనిపించింది. వెంకటేష్‌ని ‘బోనులో భగవంతుడు’ షోలో ఇంటర్వ్యూ చేసే జర్నలిస్ట్‌ మరెవరో కాదు.. గబ్బర్‌సింగ్‌కి జోడీ కట్టబోతున్న అనీషానే. ఎవరో చిన్న ఆర్టిస్ట్‌ అనుకుని ఆమె గురించి చాలా మంది పట్టించుకుని ఉండరు. 

అయితే ఆవిడే పవన్‌కళ్యాణ్‌తో హీరోయిన్‌గా నటించబోతోందని తెలిసిన అభిమానులు మాత్రం చాలా నిరుత్సాహ పడుతున్నారు. పవన్‌కళ్యాణ్‌ రేంజ్‌కి స్టార్‌ హీరోయిన్లతోనే నటించాలని వారు కోరుతున్నారు. అనీషా ఆంబ్రోస్‌ వారిని పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. బహుశా ఈ చిన్న పాత్రని ఆమె యాక్సెప్ట్‌ చేసి ఉండకూడదేమో. ఎలాగో మధుషాలిని జర్నలిస్ట్‌ పాత్ర చేసినప్పుడు ఇంటర్వ్యూ సీన్‌ కోసం ఈమెని ఎందుకు పెట్టారో మరి?

‘అలియాస్‌ జానకి’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన అనీషా ఆంబ్రోస్‌ ‘గబ్బర్‌సింగ్‌ 2’ స్టార్ట్‌ అయ్యే రోజు కోసం ఆశగా ఎదురు చూస్తోంది. అయితే ఈ ఫీడ్‌బ్యాక్‌తో ఆమెని రీప్లేస్‌ చేసినా చేస్తారేమో అనిపిస్తోంది.