శంకర్ బ్రాండ్‌కి ఉన్న వేల్యూ ఏంటనేది ‘ఐ’ ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే ప్రూవ్ అయింది. విక్రమ్‌కి తెలుగునాట మార్కెట్ ఉన్నప్పటికీ నలభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే స్టామినా అయితే ఖచ్చితంగా లేదు. కేవలం శంకర్ పేరు మీద ఐ ఇంత బిజినెస్ చేసింది. ఒక అనువాద చిత్రం ఈ స్థాయిలో బిజినెస్ చేయడం ఎప్పుడూ జరగలేదు.
శంకర్ ‘రోబో’ చిత్రాన్ని దృష్టిలో ఉంచుకుని ‘ఐ’ చిత్రానికి ఈ లెవల్లో కొనేసారు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి లైన్ క్లియర్ అయింది. నిన్న విడుదలైన ‘గోపాల గోపాల’ చిత్రం ఫర్వాలేదనే టాక్ తెచ్చుకున్నా కానీ ‘ఐ’ చిత్రాన్ని ఎఫెక్ట్ చేసే రేంజ్లో అయితే లేదు. ట్రెయిలర్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించిన ‘ఐ’ అందుకు తగ్గట్టే ఉన్నట్టయితే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు ఆశించవచ్చు.
మరోవైపు తమిళనాడులో కూడా ఐ చిత్రాన్ని ఎఫెక్ట్ చేసే పెద్ద సినిమా ఏదీ రావడం లేదు. కొన్ని సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా కానీ ఐ సినిమాకి పోటీగా నిలిచే తమిళ చిత్రం ఏదీ రిలీజ్ కావట్లేదు. హ్యూజ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కనుక అదే లెవల్లో నంబర్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు.