సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలైతే, సెకండ్ షో పడకుండానే, ఇంత వసూళ్లు, అంత వసూళ్లు అని ప్రకటనలు రెడీ అయిపోతాయి. అభిమానులు కూడా అంచనాలు కడతారు. కానీ గోపాల గోపాల విషయంలో మాత్రం ఇంత వరకు తొలి రోజు కలెక్షన్ కబర్లు వినిపించడం లేదు. నిర్మాత సురేష్ కలెక్షన్ల లెక్కలను గోప్యంగా వుంచాలని అనుకోవడమే ఇందుకు కారణం అని టాక్ వినిపిస్తోంది.
నిర్మాత సురేష్ లెక్కలు వేరుగా వుంటాయని, ఆయన పంపిణీకి తీసుకున్న సినిమా, అయితే నిర్మాతలు కలెక్షన్ లెక్కలు అంత సులువగా అందుకోలేరని, టాలీవుడ్ లో ఆప్ ది రికార్డుగా చెప్పుకుంటారు. కలెక్షన్లు బాగున్నా కూడా నిర్మాతకు వచ్చేంది అంతంత మాత్రం వుంటుందని కూడా చాటు మాటుగా చెప్పుకుంటారు.
మరి ఇప్పుడు శరద్ మురార్ భాగస్వామ్యంతో నిర్మించిన గోపాల గోపాల కలెక్షన్లు గురించి ఫ్యాన్స్ ఆరా తీసి విఫలమయ్యారని వినికిడి. దీని వెనుక కథేమిటో సురేష్ మూవీస్ కే తెలియాలి.