అసలే ఆర్థిక ఇబ్బందుల్లో వున్నారు నిర్మాత దిల్ రాజు. సరైన సినిమా పడక, పంపిణీకి కొన్న సినిమాలు బకెట్ తన్నేసి కిందా మీదా అవుతున్నారు. అలాంటి సమయంలో గోపాల గోపాల కాస్త ఆదుకునేలా కనిపిస్తోంది. ఆయన నైజాంకు 13 కు కొన్నారు. తొలిరోజే మూడు కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది.
Advertisement
ఈ లెక్కన ఐ విడుదలయ్యేలోగా తన పెట్టుబడి దిల్ రాజు రాబట్టేసుకుంటారు. ఆ తరువాత లాభాల బాట పడతారు. ఎలాగూ పండుగ సీజన్. ఆ మాత్రం కలెక్షన్లు వుంటాయి. ఇప్పటికైనా దిల్ రాజు మళ్లీ లెవెల్ అయితే మంచిదే.