మద్రాసు మనకు రానట్లే?

మద్రాసు ఇప్పుడు రావడమేమిటి? ఏనాడో తమిళులకు వెళ్లిపోయింది కదా అనుకోవద్దు. ఇది సినిమా సంగతి. కార్తీ హీరోగా నటించిన తాజా సినిమా మద్రాసు. చెన్నయ్ లోని రాయపురం హార్బర్ ప్రాతం, స్లమ్ లు, రాజకీయాలు,…

మద్రాసు ఇప్పుడు రావడమేమిటి? ఏనాడో తమిళులకు వెళ్లిపోయింది కదా అనుకోవద్దు. ఇది సినిమా సంగతి. కార్తీ హీరోగా నటించిన తాజా సినిమా మద్రాసు. చెన్నయ్ లోని రాయపురం హార్బర్ ప్రాతం, స్లమ్ లు, రాజకీయాలు, సమస్యలు వంటి వాటిని స్పృశిస్తూ తీసిన సినిమా. పిఎ రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు.కేథరిన్ ధిరిస్సా కథానాయిక. 

ఇంతకీ విషయం ఏమిటంటే ఈ సినిమా చెన్నయ్ లో ఈవారం విడుదలైంది. చాలా కాలంగా హిట్ కోసం మొహం వాచిన కార్తీకి ఓ హిట్ గా మిగిలే అవకాశాలు చిగురింపచేసింది. క్రిటిక్స్, పత్రికలు ఈ సినిమాను గాల్లోకెత్తాయి. మంచి సినిమా అని అయిదుకు నాలుగు రేటింగ్ లు ఇచ్చేసాయి. కార్తీ బాగా చేసాడని మెచ్చుకున్నాయి. ఈ సినిమా కోసం కార్తీ కాస్త బాగానే కష్టపడ్డాడు. లోకల్ స్లాంట్ నేర్చుకోవడం కోసం ఆ ప్రాంతానికి వెళ్లి కొన్నాళ్లు వున్నాడు. ఓ పది కిలోలు బరువు తగ్గి సన్నబడ్డాడు. మొత్తానికి ఫలితం సాధించాడు.

ఇంతకీ అసలువిషయానికి వస్తే, ఈ సినిమా తెలుగులో డబ్ చేసే విషయం ఇంకా ఆలోచించలేదట. జ్ఞాన్ వేల్ రాజా తన సినిమాలు అన్న తెలుగులోకి తెచ్చారు గతంలో. అయితే ఈ సినిమా ప్రారంభంలోనే ఇది అచ్చమైన చెన్నయ్ నేటివిటీ సినిమా కాబట్టి తెలుగులోకి అక్కరలేదని అనుకున్నారట.  అందుకే ఆ ఆలోచన చేయలేదు. మరి ఇప్పుడు హిట్ అయింది కాబట్టి పునరాలోచన చేస్తారేమో?