సినిమా టాక్ ఓకె..కలెక్షన్లు ఎక్కడ?

లౌక్యం సినిమాకు టాక్ ఫరవాలేదన్న రేంజ్ లో వచ్చింది. గోపీచంద్ హీరో అన్స సంగతి జనం వదిలేసారు. పృధ్వీనే గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటున్నారు. అదే మౌత్ టాక్ గా స్ప్రెడ్ కావాల్సి వుంది. కానీ…

లౌక్యం సినిమాకు టాక్ ఫరవాలేదన్న రేంజ్ లో వచ్చింది. గోపీచంద్ హీరో అన్స సంగతి జనం వదిలేసారు. పృధ్వీనే గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటున్నారు. అదే మౌత్ టాక్ గా స్ప్రెడ్ కావాల్సి వుంది. కానీ కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగా లేవట. 

మొదటి రోజు యాభై శాతం కలెక్షన్లు మాత్రమే వచ్చాయని, అన్నీ కలిపి రెండు, రెండున్నర కోట్ల మేరకు వసూళ్లు జరిగాయని తెలుస్తోంది. పాజిటివ్ టాక్, పృధ్వీ ఎఫెక్ట్ తొ రెండవ రోజు నుంచి పుంజుకుంటాయేమో చూడాలి. ప్రమోషన్ పై కాస్త సీరియస్ గానే వున్నారు యూనిట్. టీవీ షోలు బాగానే చేస్తున్నారు. పైగా సెలవులు వచ్చాయి కాబట్టి కాస్తు పుంజుకుంటుందేమో చూడాలి.