అవునా.? నిజమా.?

'అవును' సినిమా అప్పట్లో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. థ్రిల్లర్‌ సినిమాల్ని ఇష్టపడేవారిని ఆకట్టుకుంది. దాంతో, దానికి సీక్వెల్‌ని రూపొందించాడు దర్శకుడు రవిబాబు. అదే 'అవును-2'. అయితే మొదటి వెర్షన్‌ని మించి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌…

'అవును' సినిమా అప్పట్లో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. థ్రిల్లర్‌ సినిమాల్ని ఇష్టపడేవారిని ఆకట్టుకుంది. దాంతో, దానికి సీక్వెల్‌ని రూపొందించాడు దర్శకుడు రవిబాబు. అదే 'అవును-2'. అయితే మొదటి వెర్షన్‌ని మించి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ వుండాల్సింది పోయి, మొదటిదానికన్నా చప్పగా సాగింది 'అవును-2'.

సీక్వెల్‌ విషయంలో రవిబాబు రెండోసారి ఆశించిన విజయాన్ని అందుకోలేదనే అభిప్రాయాలు ఓ పక్క ఆడియన్స్‌ నుంచి వ్యక్తమవుతోంటే, సినిమా మంచి విజయాన్ని అందుకుందనీ, 'అవును' కన్నా 'అవును-2' మూడింతల వసూళ్ళు నమోదు చేసిందని ప్రకటించేశారు.

అవునా? నిజమా.? అని అంతా ఆశ్చర్యపోవాల్సి వస్తోందిప్పుడు. 'అవును-2'కి అంత లేదని.. ఓ పక్కన టాక్‌ నడుస్తోంటే, నిర్మాతల ప్రకటన దానికి భిన్నంగా వుంది. నిజమేంటో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. ఆల్రెడీ వికెండ్‌ అయిపోయింది గనుక, 'అవును-2' వసూళ్ళు డ్రాప్‌ అవడానికే ఛాన్సుంది తప్ప, పికప్‌ అయ్యేందుకు గల ఛాన్సులు చాలా చాలా తక్కువ. అయితే తక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమా గనుక, సినిమాకి చేసిన పబ్లిసిటీతో ఓపెనింగ్స్‌ రాబట్టడంతో సినిమాకి లాభాలు తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.