గబ్బర్ సింగ్ స్టయిల్ డిఫరెంట్ గురూ

సినిమా అన్నది పబ్లిక్ వ్యవహారం. ఇది మా స్వంతం..మేం తీసినప్పుడు మీరు చూడండి..తీస్తామో, తీయమో, ఆరా తీయకండి అనడానికి లేదు. ఎందుకంటే ప్రేక్షకుల క్యూరియాసిటీ మీదే సినిమా హైప్ ఆధారపడి వుంటుంది. కాబట్టి. గబ్బర్…

సినిమా అన్నది పబ్లిక్ వ్యవహారం. ఇది మా స్వంతం..మేం తీసినప్పుడు మీరు చూడండి..తీస్తామో, తీయమో, ఆరా తీయకండి అనడానికి లేదు. ఎందుకంటే ప్రేక్షకుల క్యూరియాసిటీ మీదే సినిమా హైప్ ఆధారపడి వుంటుంది. కాబట్టి. గబ్బర్ సింగ్ 2 అనే సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ప్రేక్షకులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గబ్బర్ సింగ్ సినిమా పంచిన వినోదం రేంజ్ అలాంటిది..పవన్ కళ్యాణ్ చరిష్మా అలాంటిది. కానీ ఆ సినిమా వైనం ఏం జరుగుతోందన్నది ఎవరికీ తెలియదు. 

అదో బ్రహ్మ పదార్థం. సంపత్ నంది స్క్రిప్ట్ పై అనుమానాలు,  వైదొలుగుతారన్న వార్తలు ముందుగా గ్యాసిప్ లు గానే బయటకు వచ్చాయి. కానీ ఎప్పుడు అధికారికంగా ఖండించలేదు. ఆఖరికి అవే నిజమయ్యాయి. ఆయన బయటకు వెళ్లిపోయారు. అప్పుడయినా, ఏం జరిగిందన్నది అఫిషియల్ గా చెప్పలేదు. బాబి ఎంటర్ అయ్యారన్నది కూడా లీకులు , గ్యాసిప్ ల ద్వారానే తెలిసింది. 

ఇప్పుడు బాబి పై, సినిమా మేకింగ్ పై అనుమానాలు మొదలయ్యాయి. మీకేందుకు  మా సినిమా పై అనుమానాలు, ఆరాలు అని అడగడానికి లేదు. ఎందుకంటే జనానికి గబ్బర్ సింగ్ 2 వ్యవహారం ఏం జరుగుతోందో అన్న ఆసక్తి వుంది. వారి ఆసక్తిని పట్టి వార్తలివ్వడం అన్నది మీడియా ఐడియా. అలా కాదు, నికార్సయిన సమాచారమే ఇవ్వాలంటే, అఫిషియల్ గా అప్పుడప్పుడైనా ఏదో సమాచారం విడుదల చేయాలి. స్క్రిప్టు ఫైనల్ అయింది..లోకేషన్లు సెలెక్ట్ చేస్తున్నాం..స్టార్ కాస్ట్ ఓకె అయింది ఇలా. ఇది వారికి రెండువిదాల లాభం. ఒకటి సినిమాపై నికార్సయిన వార్తలే వస్తాయి. రెండవది సినిమాపై అంచనాలు గ్రాడ్యువల్ గా పెరుగుతాయి. 

కానీ గబ్బర్ సింగ్ 2 పై పవన్ అస్సలు పెదవి విప్పరు. దర్శకుడు ఫోన్ చేసినా పలకరు. అలా అని అక్కడా, ఇక్కడా వినబడిన సమాచారం రాస్తే మాత్రం, మీడియాకు నోట్ కాకుండా లీకులు ఇవ్వడం మొదలెడతారు. ఇలా జరుగతోంది.. అలా జరుగుతోంది.. త్వరలో మొదలవుతుంది అంటూ. అదేదో అఫిషియల్ గానే చెప్పచ్చుగా.. ఏంటో పవర్ స్టార్ వ్యవహారం.. అంతా గుంభనం..పాలిటిక్స్ అయినా, సినిమా లైనా అంతా గుట్టే.