క్లాస్ సినిమాలకు, మంచి ఫీల్ గుడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు శేఖర్ కమ్ముల. అలాంటి శేఖర్ కమ్ముల దాదాపు రెండేళ్లకు పైగా ఒకే సబ్జెక్ట్ పై వర్క్ చేస్తున్నారు.
హీరో ధనుష్ తో థ్రిల్లర్ సినిమా. కేవలం ఈ సినిమా స్క్రిప్ట్ మీద రెండేళ్లు పని చేసారు. స్క్రిప్ట్ లాక్ అయింది. కానీ స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యేసరికి భారీ మల్టీ స్టారర్ గా మారిపోయిందని తెలుస్తోంది.
ధనుష్ కు జోడీగా రష్మికను తీసుకోవాలని చూస్తున్నారు. డేట్ ల కోసం డిస్కషన్లు జరుగుతున్నాయి. డేట్ లు ఫైనల్ అయితే రష్మిక ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అలాగే ఓ తెలుగు సీనియర్ హీరో ను ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు. చాలా కీలకమైన పాత్ర ఇది.
అందుకే ఆ సీనియర్ హీరోను అప్రోచ్ కావడం, దానికి ఆ సీనియర్ హీరో ఓకె అన్నారు. మ్యూజిక్ డైరక్టర్ గా రెహమాన్ ను తీసుకున్నారు. మంచి పాటలు చేయించుకోగల సత్తా శేఖర్ కమ్ములకు వుంది. లవ్ స్టోరీ సినిమాకు రెహమాన్ శిష్యుడితో పని చేసారు. ఇప్పుడు ఏకంగా రెహమాన్ తోనే చేస్తున్నారు.
ఇలా ధనుష్, తెలుగు సీనియర్ హీరో, రష్మిక, రెహమాన్ అందరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ గా ఈ సినిమా మారబోతోంది.