14రీల్స్ సంస్థ బయ్యర్ల నుంచి తిట్లు, శాపనార్థాలు ఎదుర్కొంటోంది. తమ డబ్బులు తమకివ్వాలని నానా గోల పెడుతున్నారు బయ్యర్లు. అంతా ఆగడు మహిమ. నిర్మాత అనిల్ సుంకర అమెరికా వెళ్లి కూర్చున్నారు. ఇక్కడ సమాధానం చెప్పేవారు లేరు. కానీ ఈ సమస్య నుంచి గట్టెక్కడానికా అన్నట్లు ఓ అద్భుతమైన ఫీలర్ కు రూపకల్పన చేసారు ఎవరో కానీ. ఈ ఫీలర్ ను ఎలాగైనా బయ్యర్లలోకి పంపాలని చూస్తున్నారు.
అదేమిటంటే, మహేష్ బాబు 14 రీల్స్ సంస్థకు మరో సినిమా ఆఫర్ ఇచ్చాడు. తివిక్రమ్ తో చేయబోయే సినిమాను చేసుకోమన్నాడు అన్నది ఆ ఫీలర్. కానీ నిజానికి ఆ సినిమాకు వేరే నిర్మాత లైన్ లో వున్నాడన్నది వాస్తవం. పైగా అనిల్ సుంకర ఓ వైపు, ఆచంట సోదురులు మరోవైపు వుంటే, జనాలు ఈసారి ఎలాంటి సినిమా వస్తుందో అని టెన్షన్ పడుతుంటే, త్రివిక్రమ్ సినిమా చేయగలడా అన్నది అనుమానం.
పైగా లైన్లో వున్న నిర్మాత త్రివిక్రమ్, మహేష్ లాంటి కాంబినేషన్ ను అంత సులువుగా వదులుకుంటాడా? బయ్యర్ల కు కాస్త ఊరటనివ్వడానికా లేక నిజంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది తెలియాల్సి వుంది.