Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ మల్టీస్టారర్ అంతా ఉత్తుత్తినేనా?

నాగ్ మల్టీస్టారర్ అంతా ఉత్తుత్తినేనా?

నాగార్జున, ఎన్టీఆర్ సినిమా అన్నారు కొన్నాళ్లు. తీరా చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కవైపోతుందని ఎన్టీఆర్ ను డ్రాప్ చేసారు. కార్తీని చేర్చారు అన్నారు. కానీ నిజానికి ఇవన్నీ ఉత్తుత్తి కబుర్లే అని, అసలు ఏదీ ఫైనల్ కాలేదని టాలీవుడ్ వర్గాల బోగట్టా. కథ నచ్చకే ఎన్టీఆర్  వదిలేసాడని, కార్తీ కన్సిడరేషన్ లేనే లేదని తెలిసింది. 

కార్తీకి ఇప్పుడు ఇక్కడ మార్కెట్ లేదు. మాంచి సినిమా పడితే తప్ప, తెలుగులోకి రాకూడదని కార్తీ భావిస్తున్నాడు. అందుకే ఈవారం విడుదలవుతున్న ‘మద్రాసు’కూడా కేవలం తమిళంలోనే చేసారు. జ్ఞనవేల్ రాజా దాన్ని తెలుగులోకి తేవడం లేదు. అందువల్ల ఈ ప్రాజెక్టు ఇంత వేగంగా పట్టాలు ఎక్కే సూచనలు కనిపించడం లేదు.​

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?