నిఖిల్ పెళ్లి ఎప్పుడు?

అల్లరి నరేష్, నిఖిల్ ఇంకా టాలీవుడ్ అన్ మారీడ్ హీరోల జాబితాలోనే వున్నారు. ఇద్దరు ఇంట్లో వాళ్లమీదే భారం వేసారు. నిఖల్ ను ఇంట్లో పెళ్లికి ప్రెజర్ చేస్తే, రెండు హిట్ లు కొట్టాక…

అల్లరి నరేష్, నిఖిల్ ఇంకా టాలీవుడ్ అన్ మారీడ్ హీరోల జాబితాలోనే వున్నారు. ఇద్దరు ఇంట్లో వాళ్లమీదే భారం వేసారు. నిఖల్ ను ఇంట్లో పెళ్లికి ప్రెజర్ చేస్తే, రెండు హిట్ లు కొట్టాక చూద్దాం అన్నాడట. ఇప్పుడు మూడు హిట్ లు అయ్యాయి కదా..అని ఇంట్లో వాళ్లు సంబంధాలు చూడడం ప్రారంభించేసారట. 

కానీ ఇంకా నిఖిల్ మాత్రం ఊ..ఆ అనడం లేదట. అదేం అని అడిగితే, నెల రెండు నెలలు ఆడాలనే సినిమా స్క్రిప్ట్ విషయంలోనే ఎంతో జాగ్రత్త తీసుకుంటాం…నిండు నూరేళ్లు కాపురం చేయాల్సిన అమ్మాయి విషయంలో ఇంకెత జాగ్రత్తగా వుండాలి అని అంటున్నాడట. 

కానీ మళ్లీ అంతలోనే, ఎవరికి ఎవరు రాసిపెట్టి వున్నారో చూడాలి..మన చేతుల్లో ఏముంది అని ఫిలాసఫీ చెబుతున్నాడట. కుర్రాడి మాటలకేం అని నిఖిల్ అమ్మానాన్నలు మాత్రం తమ వెదుకులాట తాము సాగిస్తున్నారట. అంటే ఇంక సరైన సంబంధం రావాలే కానీ..బాజాలే..