పాటలు పాడాలంటే సింగర్లే కావాలా? ఆ రూలు ఎప్పుడో పక్కన పెట్టేసారు దేవీశ్రీ ప్రసాద్, థమన్. స్వరం ఎంత డిఫరెంట్ గా వుంటే అంత సూపర్ అనేటట్లు తయారు చేసారు. ఎక్కడెక్కడి నుంచో ఏయే గొంతులనో దిగుమతి చేసారు. అది చాలదన్నట్లు హీరో అయితే చాలు, ఎవరైనా సరే పాట పాడించేసారు. ఒక్కోసారి డైరక్టర్లు కూడా గొంతు కలిపేసారు. నిజమైన సంగీత ప్రియలు సినిమా సంగీతం వినడం ఎలాగూ తగ్గంచేసారు. అందువల్ల వచ్చిన నష్టమేమీ లేకపోయింది.
Watch Lakshmi Manchu Singing Video
ఇప్పుడు కుంచే రఘ కూడా దేవీ, థమన్ బాట పట్టి మంచు లక్ష్మి చేత దొంగాటలో పాట పాడించేసాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పాట, ఆ పాట మేకింగ్ వీడియో బయటకు వచ్చాయి. రఘు కుంచె కాస్త మంచి క్యాచీ ట్యూనే తయారు చేసాడు. దానికి తేలిక పాటి పదాలతో మంచి లిరిక్ కూడా కుదిరింది. పాట రికార్డింగ్ లోనే ఇంతలా గెంతులేసారు..లక్ష్మీ అండ్ కో,. మధ్యలో పాట స్క్రీన్ మీద కూడా ఎలా వుంటుందో చిన్న బిట్ జోడించారు.
దాన్ని చూస్తుంటే దొంగాట సినిమాలో మాంచి మాస్ బీట్..విత్ ఓన్లీ లేడీ ప్రెజెంటర్స్ తో వుండేలా వుంది. ఆ మధ్య ఎప్పుడో పూరి సినిమాలో ప్రియమణి, మగాళ్లు వట్టి మాయగాళ్లే..అంటూ మందేసి, చిందేసింది. ఇప్పుడు మంచు లక్ష్మి, యాందిరో..ఈ మగాళ్ల గొప్ప అంటూ ఫ్యాంటు షర్ట్ వేసి గెంతులేసింది. చూడాలి ప్రేక్షకులు ఎంత గెంతులేస్తారో?