బాలయ్య సినిమా అంటే మాస్ ఏరియాల్లో మహా మార్కెట్ వుంటుంది. కానీ లయన్ బిజినెస్ వార్తలు మాత్రం అంతగా బయటకు రావడం లేదు. పైగా నిర్మాత రమణారావు ఫుల్ స్టామినా వున్న బిజినెస్ మెన్. అవసరమైతే నేరుగా విడుదల చేసుకోగలరు. బాలయ్య ప్లస్ బోయపాటి అంటే ఆ దారి వేరు. దాని మార్కెట్ వేరు కానీ కొత్త దర్శకుడు అనగానే మార్కెట్ అంత అనుకూలంగా స్పందించడం లేదని వినికిడి,.
ఓవర్ సీస్ మరీ పాతిక లక్షలు వెళ్లిందని తెలుస్తోంది. ఇదే బాలయ్య ప్లస్ మరో పెద్ద డైరక్టర్ అయితే కోటి పలికేది. ఇక లోకల్ మార్కెట్ కూడా ఇంకా అడ్వాన్స్ ల స్టేజ్ లోనే తప్ప, ఫైనల్ గా ఫిగర్లు కొలిక్కి రాలేదని వినికిడి. తొలి టీజర్ తో కాస్త ఊపు వచ్చింది. అడియో ఫంక్షన్ లో ట్రయిలర్ వదిలితే మార్కెట్ ఊపు వస్తుందేమో మరి?