'అచ్చం తమన్నా లాంటి పెళ్లాం కావాలి…'' అని ఆ మధ్య ప్రకటించాడు హీరో కార్తీ. సూర్య తమ్ముడిగా, తమిళ తెలుగు భాషలకు నటుడిగా పరిచయం అయిన కార్తీ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకొన్నాడు. వరస హిట్లతో దూసుకుపోయాడు.. తర్వాత కొన్ని ప్లాఫులతో ఇతడి కెరీర్ కొంత మందగమనంలో పడింది. ఇలాంటి నేపథ్యంలో కార్తీ కెరీర్ లో మరిచిపోలేని సినిమా 'ఆవారా'. సూపర్ హిట్ అయిన ఈ సినిమా లో అతడికి జంటగా నటించింది తమన్నా.
అప్పట్లోనే ఈ హీరో తమన్నాకు పడిపోయాడట. జీవితంలో పెళ్లి చేసుకొంటే అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కూడా స్టేట్ మెంట్లు ఇచ్చేశాడు. అయితే ఇతడికి పెళ్లి అయ్యింది కానీ.. తమన్నా పెళ్లాం కాలేదు! వేరే అమ్మాయిని ఈ హీరో పెళ్లి చేసుకొన్నాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు కార్తీకి తమన్నాతో తిరిగి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరో నాగార్జునతో కలిసి కార్తీ ఒక సినిమా చేస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల కోసం ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో మొదట కార్తీకి జంటగా శ్రుతిహాసన్ ను అనుకొన్నారు కానీ.. ఆమె ఈసినిమాకు డేట్స్ సర్దలేకపోయింది. అదోవివాదం అయ్యింది.. శ్రుతి అలా తప్పుకోవడంతో తమన్నాను ఈ అవకాశం వరించిందన్నది తెలిసిన విషయమే.
మరి ఇప్పుడు తమన్నా తిరిగి కార్తీతో జతకడితే.. వీళ్ల పాత స్నేహం మళ్లీ మొదలవుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లోనే తమన్నా మీద తనకున్న క్రేజ్ ను ప్రకటించేసుకొన్న కార్తీ.. ఇప్పుడు ఆమెకు మళ్లీ దగ్గర అయ్యేందుకు ట్రై చేయడంలో పెద్దగా సందేహాలు లేకపోవచ్చు. అయితే అతడు పెళ్లైన వ్యక్తి కావడంతో.. తమన్నా అతడికి ఎంత వరకూ చేరువవుతుందనేది ఆసక్తికరమైన అంశం.