ఆదిపురుష్ ఎఫెక్ట్.. ఇంకా కోపం చల్లారలేదు

ప్రభాస్ నటించిన మొట్టమొదటి మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది, వివాదాస్పదమైంది, వసూళ్లపై కూడా ప్రభావం పడింది. మొత్తానికి ఎలాగోలా రన్ పూర్తి చేసుకుంది. ఆదిపురుష్ అనేది…

ప్రభాస్ నటించిన మొట్టమొదటి మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది, వివాదాస్పదమైంది, వసూళ్లపై కూడా ప్రభావం పడింది. మొత్తానికి ఎలాగోలా రన్ పూర్తి చేసుకుంది. ఆదిపురుష్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ కానే కాదు.

ప్రభాస్ ఫ్యాన్స్ కూడా  సలార్, కల్కి సినిమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆదిపురుష్ యూనిట్ నుంచి ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఒక్కొక్కరు బయటకు రావడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా దర్శకుడు ఓం రౌత్ కూడా మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేశాడు. కానీ ఊహించని ఎదురుదెబ్బ తిన్నాడు.

తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు ఓం రౌత్. అందులో 2 ఆలయాల్ని ప్రస్తావించాడు. ఆ రెండు ఆలయాలు తన బాల్యాన్ని బాగా ప్రభావితం చేశాయని అన్నాడు. తన జీవిత మూలాల్ని బలోపేతం చేయడానికి ఆ రెండు ఆలయాలు మంచి పాత్ర పోషించాయని రాసుకొచ్చాడు.

మళ్లీ యాక్టివ్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్..

ఓం రౌత్ మరోసారి ఇలా ఆలయాలు, దేవుడు, ఆశీర్వాదం అనే పదాలు వాడేటప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. నువ్వు భక్తి ముసుగు నుంచి బయటకు రా అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తూ.. కల్కి గ్లింప్స్ చూసి నేర్చుకోమంటూ మరికొందరు సూచించారు.

చిన్న కెమెరా ఉంటే షార్ట్ ఫిలిమ్స్ తీసుకోమంటూ మరికొందరు చురకలు అంటిస్తే.. నువ్వు ఇకపై సినిమాలు తీస్తే ఊరుకునేది లేదంటూ ఇంకొందరు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఊహించని విధంగా ఓం రౌత్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రభాస్ ఫ్యాన్స్. పోస్ట్ పెట్టి గంటలు గడుస్తున్నా, ఇంకా ఫ్యాన్స్ ఆవేశం చల్లారలేదు.

నిజానికి సలార్, కల్కి అప్ డేట్స్ రాకతో ఆదిపురుష్ పై ఆగ్రహం చల్లారి ఉంటుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. అప్పుడు మరోసారి టోటల్ టీమ్ సోషల్ మీడియాలో టార్గెట్ అవ్వక తప్పదు.