చిరంజీవి పైకి వస్తున్నరోజులవి.. అప్పటిదాకా ఎన్టీఆర్ లాయల్ ప్రొడ్యూసర్లు.. అశ్వనీదత్, దేవీ వరప్రసాద్.. విజయలక్ష్మీ త్రివిక్రమరావు, ఇలా చాలా మంది. మెలమెల్లగా వాళ్లు చిరంజీవి వైపు వచ్చారు. ఆ తరువాత చిరకాలం చిరంజీవి నిర్మాతలుగా వున్నారు.
వర్తమానానికి వస్తే.. ఎన్వీ ప్రసాద్.. మెగా ఫ్యామిలీ మనిషి..ఠాగూర్ మధు..చిరంజీవి నిర్మాత.. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మహేష్ బాబుతో..మురగదాస్ డైరక్షన్ లో సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. నిర్మాత అంటే వ్యాపారం.. ఎవరితో అయినా చేసుకోవచ్చు. అదేం పెద్ద ఇస్యూ కాదు. కానీ, ఇంట్లో ఫుల్ బిజీ గా వుంటే బయటకు వెళ్లే పని వుండదు.
కానీ రామ్ చరణ్ కి, మహేష్ బాబుకి ఓ తేడా స్పష్టంగా కనిపిస్తోంది..బ్రహ్మోత్సవం..ఆ తరువాత మురగదాస్..ఆపై వినాయక్ కావచ్చు.. త్రివిక్రమ్ కావచ్చు.. మొత్తానికి మూడేళ్ల వరకు ఓ అయిడియా వుంది..లెక్క వుంది.
కానీ రామ్ చరణ్ ఏం చేస్తాడు ఇప్పుడు అంటే ఎవరికీ ఏ విషయం తెలియదు. క్లారిటీ లేదు. థని ఒరువన్ చేస్తారో లేదో తెలియదు. అది కూడా మామయ్య అరవింద్ బ్యానర్ నే. ఆ సినిమా కబురు తప్ప మరొక కబురు లేదు. గౌతమ్ మీనన్ పేరు ఆ మధ్య వినిపించింది..ఇప్పుడు వినిపించడం లేదు. డైరక్టర్లకు చరణ్ అందుబాటులో వుండడం లేదన్న రూమర్ వుంది.
చరణ్ తరచు క్యాంప్ ల్లో వుంటారు.. ఎప్పుడు మాట్లాడాలన్నా కుదరదు అని నిర్మాతల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క చరణ్ తన మేనేజర్ ప్రవీణ్ గీసిన గీటు దాటరని, ఆయనేమో, ఆయనకు నచ్చిన వారితోనే ప్రాజెక్టులు సెట్ చేస్తారని, అందువల్ల కూడా అందరు నిర్మాతలు చరణ్ దగ్గరకు వెళ్లలేకపోతున్నారన్న వదంతులు కూడా వున్నాయి.
మొత్తానికి ఇప్పుడు మెగా క్యాంప్ ప్రొడ్యూసర్లే మహేష్ బాట పడితే, మిగిలిన వారి సంగతేమిటో?