గోవిందుడుపై గ్యాసిప్ లు వద్దు

ఓ మంచి కుటుంబ కథా చిత్రం తీయాలనే సంకల్పంతో గోవిందుడు అందరి వాడేలే సినిమా తీస్తున్నామని, దయచేసి, ఆ సినిమా కథపై అక్కర్లేని గ్యాసిప్ లు పుట్టించవద్దని నిర్మాత బండ్లగణేష్ విజ్ఞప్తి చేసారు.  Advertisement…

ఓ మంచి కుటుంబ కథా చిత్రం తీయాలనే సంకల్పంతో గోవిందుడు అందరి వాడేలే సినిమా తీస్తున్నామని, దయచేసి, ఆ సినిమా కథపై అక్కర్లేని గ్యాసిప్ లు పుట్టించవద్దని నిర్మాత బండ్లగణేష్ విజ్ఞప్తి చేసారు. 

గోవిందుడు కథ ఇదంటూ కథనాలు అల్లుతున్నారని, అవేవీ నిజాలు కాదని, మంచి అనుబంధాలు, ఆప్యాయతలు నిండిన కథ అని, చివరి అరగంటా ప్రకాష్ రాజ్, జయసుధలతో, చరణ్ మధ్య మాంచి ఎమోషనల్ సీన్ వుంటుందని, అలాంటి మంచి సినిమాకు ఇలాంటి తప్పడు ప్రచారం తగదని ఆయన ఆవేదన వ్యక్తం ఇప్పటికే ఇండస్ట్రీ సరైన హిట్ లు లేక కోట్లాది రూపాయిలు నష్టపోయిందని, ఇలాంటి తప్పుడు కథనాల వల్ల మరింత నష్టాల్లోకి పోయే ప్రమాదం వుందని ఆయన అన్నారు. 

దయచేసి గోవిందుడుపై ఇవి ఆపండి..ఆయన కోరారు.