నిర్మాతగా తనకి అనుక్షణం లాభాలు తెచ్చిపెట్టిందని మంచు విష్ణు చెబుతున్నాడు కానీ ప్రేక్షకుల దృష్టిలో మాత్రం అది సోదిలో లేకుండా పోయిన సినిమా. ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో కూడా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం విష్ణు తన బ్యానర్‌పై రూపొందిన ‘కరెంట్ తీగ’ని మార్కెట్ చేసుకునే పనిలో ఉన్నాడు.
మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఓ తమిళ హిట్ చిత్రానికి రీమేక్. దీనిపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత మంచు విష్ణు నుంచి ఒక హిట్ సినిమా వస్తుందని అంటున్నారు. నిర్మాతగా తనకి కాస్త డబ్బులు తెచ్చిపెట్టే చిత్రం ఇదే అవుతుందని టాక్ ఉంది. అందుకే ఈ చిత్రాన్ని పెద్ద సినిమాల మధ్య విడుదల చేసి నష్టపోవడం కంటే సేఫ్‌గా రిలీజ్ చేయాలని విష్ణు భావిస్తున్నాడు.
కరెంట్ తీగ చిత్రాన్ని ముందుగా అక్టోబర్ 2న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికే మార్కెట్లో గోవిందుడు అందరివాడేలే, లౌక్యం సినిమాలుంటాయి. వీటితో పాటుగా దీనిని విడుదల చేస్తే ప్రేక్షకులు దృష్టి దీనిపై పడే అవకాశాలు తగ్గుతాయి. అందుకే తెలివిగా ఆలోచించి కరెంట్ తీగని వెనక్కి నెట్టారు.