హీరోల పారితోషికం విపరీతంగా పెరిగిపోవడంతో నిర్మాతలకి నరకం కనిపిస్తోంది. హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్లు కూడా తమ పారితోషికం విపరీతంగా పెంచేసారు. దీంతో ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ ఉంటే వారి పారితోషికాలకే పాతిక నుంచి ముప్పయ్ కోట్లు ఖర్చయిపోతోంది. ఇక మేకింగ్ కాస్ట్‌తో కలిపి అరవై కోట్ల బడ్జెట్ ఈజీగా అయిపోతోంది.
ఇంత ఖర్చు పెట్టినపుడు సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరాలి. లేదంటే నిర్మాతతో పాటు బయ్యర్లు కూడా తీవ్రంగా నష్టపోతారు. రీసెంట్ డిజాస్టర్స్ రభస, ఆగడు నేపథ్యంలో నిర్మాతలంతా కలిసి సమావేశమయ్యారు. హీరోలు, దర్శకుల పారితోషికం తగ్గించకపోతే కష్టమని తీర్మానించారు. త్వరలోనే హీరోలతో కలిసి సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారు.
గతంలో కూడా ఇలాంటి చర్చలు జరిగాయి కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. మరి ఈసారైనా గట్టి నిర్ణయాలు తీసుకుంటారో లేక ఎప్పటిలానే మీటింగులకే పరిమితం అవుతారో?