సగటు టాక్ వచ్చినా, ఓపెనింగ్ డే ఓ మాదిరిగా వున్నా జేమ్స్ బాండ్ సినిమాకు శాటర్ డే, సండే బాగానే కలిసి వచ్చాయి. కామెడీ సినిమాలకు మొహం వాచిన జనం వీకెండ్ లో జేమ్స్ బాండ్ ను బాగానే ఆదరించారు. అయితే ఇది నిల్చుంటుందా అన్నది అనుమానం. అందుకే హీరో నరేష్ అండ్ కో, ప్రచారంపై దృష్టి పెట్టారు.
సోమవారం నుంచి థియేటర్ల పర్యటన ప్రారంభిస్తున్నారు. సోమవారం ఉదయం శ్రీకాకుళం మారుతి థియేటర్, మధ్యాహ్నానికి విజయనగరం లీలా మహల్, సాయంత్రానికి వైజాగ్ సిఎమ్ఆర్ ఐనాక్స్, రాత్రికి తుని రామా, కాకినాడ దేవి, రాజమండ్రి కుమారి థియేటర్లను సందర్శిస్తారు.
ఇలా మరో రెండు మూడు రోజులు క్రౌడ్ లను రాబట్టగలిగితే చాలు జేమ్స్ బాండ్ గట్టెక్కేస్తాడు.