బాహుబలి పార్ట్ 2 సినిమా దాదాపు సగం పూర్తయిందని ఓ పక్క వార్తలు వినవస్తున్నాయి. కానీ పార్ట్ 2 కథ ఇంకా వండాలని, అదే తన తలపై భారంగా వుందని, ఆ సినిమా కథకుడు విజయేంద్ర ప్రసాద్ అంటున్నారు.
దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ ఈ విషయం చెబుతూ, ప్రేక్షకుల అంచనాలు భయంకరంగా పెరిగాయని, దానికి తగ్గట్లు కథ తయారుచేయాల్సి వుందని, అన్యాపదేశంగా చెప్పారు.
అంటే దీన్ని బట్టి, తొలి సగంపై వచ్చిన విమర్శలు, దానిలో వున్న లోటుపాట్లు, మలి సగాన్ని కూడా మూడు వందల కోట్ల సినిమాగా మార్చి తీరాల్సిన బాధ్యత, ఇలా వీటన్నింటిని దృష్టిలో వుంచుకుని స్క్రిప్ట్ చేస్తారేమో?
అలా అయితే మరో నెలా, రెండు నెలల్లో సెట్ పైకి ఎలా వెళ్తారు? అయితే సినిమా సెట్ పైకి ఆలస్యంగానైనా వెళ్లాలి. లేదా విజయేంద్ర ప్రసాద్ చెప్పింది నిజం కాకపోవచ్చు.