ఆటోనగర్ సూర్యతో మళ్లీ చాన్స్ వస్తుందా అనుకునే స్టేజ్ లో వున్న దర్శకుడు దేవా కట్టాకు హీరో విష్ణు పిలిచి, తమిళ సినిమా రీమేక్ బాధ్యతలు అప్పగించాడు. దాంతో డైనమేట్ ప్రాజెక్టు ఫిక్సయింది..పూర్తయింది. కానీ బాహుబలి అడ్డం పడ్టాడు. సరే అయింది అనుకుంటే శ్రీమంతుడు వస్తున్నాడు.
Advertisement
దానికీ దీనికి మధ్య మూడు నాలుగు వారాలు గ్యాప్ వున్నా వాడుకోలేదు మరేలనో? శ్రీమంతుడు అయ్యాక కిక్ 2, రుద్రమదేవీ క్యూలో వున్నాయి. ఇలా ఒక్కోదానికి సైడ్ ఇస్తూ పోతూ వుంటే, డైనమేట్ ఎప్పటికీ లూప్ లైన్ లో వుండిపోతుంది. తెగించి, ఏదో డేట్ కు మెయిన్ ట్రాక్ మీదకు రావాలి.