ఈ మధ్యకాలంలో ఫ్రీమేక్ లు, రీమేక్ లు ఎక్కువైపోయాయి. పాత సినిమానో, పరభాషా సినిమాలోంచో, లైన్ మాత్రం తీసుకుని కొత్తగా తీసేయడం ఫ్రీమేక్ టెక్నిక్. దిల్ రాజు, సాయిధరమ్ తేజ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమాకు గతంలో చిరంజీవి నటించిన మొగుడు కావాలి సినిమా ప్రేరణ అన్న టాక్ వినిపిస్తోంది.
తండ్రి వదిలి వెళ్లిన ఆస్తి పొందేందకు, పెళ్లి చేసుకుతీరాలి అనే కండిషన్ తో, అద్దె మొగుడ్ని తెచ్చుకుంటోందో అమ్మాయి. కానీ తీరా అలా వచ్చిన వాడు నిజం మొగుడై కూర్చుని, ఆమెలో పరివర్తన ఎలా తెచ్చాడు అన్నది ఆ సినిమా లైన్.
తమ్మారెడ్డి భరద్వాజ అప్పట్లో చిరంజీవి-గాయత్రి కాంబినేషన్ లో కట్టాసుబ్బారావు డైరక్షన్ లో ఈ సినిమా నిర్మించారు. యాజ్ ఇట్ ఈజ్ గా కాకున్నా, కాస్త ఆ లైన్ నే అటు ఇటు చేసి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీసారని వినికిడి. ఎంతవరకు నిజమో అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాలి.