మలయాళంలో చిన్న సినిమాగా పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ప్రేమమ్. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలా? వద్దా? చేసే వీలుంటుందా? వుండదా? అందులోని ఫీల్ ను తెలుగులోకి తేగలమా? లేదా? ఇలాంటి సమస్యలతో కిందా మీదా అయిపోతున్నారు టాలీవుడ్ నిర్మాతలు.
ముందు ఈ సినిమాపై స్రవంతి రవికిషోర్ కన్నేసారని వార్తలు వినవచ్చాయి. కానీ ఇప్పుడు ఆయన కాదు, హారిక హాసిని రాథాకృష్ణగారు ఇంట్రెస్ట్ గా వున్నారు అని వినికిడి. ఓ పాపులర్ యంగ్ హీరోతో ఈ సినిమా చేయాలని ఆయన అనుకుంటున్నారు. కొత్త దర్శకులను ప్రోత్సహించే ఆ యంగ్ నట వారసుడు కూడా ఈ సినిమా పట్ల ఆసక్తిగానే వున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే ఓ మాస్ వెరైటీ సినిమా చేసి, చేదు ఫలితం చవిచూసిన ఆ హీరో, ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేస్తే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నాడట. మనవాళ్లు అక్కడి సినిమాలోని ఫీల్ ను ఇక్కడకు తేగలిగితే ఓకె,. లేకుంటే మాత్రం కష్టం. అందుకోసం వారంతా ఒకటి కి పది సార్లు ఆ సినిమా చూస్తున్నారట. హారిక హాసిని బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ కూడా దీనిపై ఆలోచిస్తున్నారట.