బ్రహ్మానందంపై వాలిపోయారు

తెలుగు సినిమా అంటే హీరో చుట్టూ తిరిగే రోజులు పోయాయి. ఎలాగోలా హిట్ కొట్టి, పరువు దక్కించుకుంటే చాలన్న ఆలోచన కనిపిస్తోంది. అందుకే అవసరమైతే అరగంట సేపు స్క్రీన్ ను కమెడియన్లకు వదిలేయడానికి హీరోలు…

తెలుగు సినిమా అంటే హీరో చుట్టూ తిరిగే రోజులు పోయాయి. ఎలాగోలా హిట్ కొట్టి, పరువు దక్కించుకుంటే చాలన్న ఆలోచన కనిపిస్తోంది. అందుకే అవసరమైతే అరగంట సేపు స్క్రీన్ ను కమెడియన్లకు వదిలేయడానికి హీరోలు మొహమాట పడడం లేదు. లౌక్యం సినిమా ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. 

సినిమా విడుదల కాకుండానే బ్రహ్మీ డైలాగులతో పబ్లిసిటీకి తెరతీసింది. బ్రహ్మీ ది ఈ సినిమాలో మాంచి క్యారెక్టర్ అన్న రేంజ్ లో ఎఫ్ ఎమ్ ల్లో పబ్లిసిటీ ఊదర గొటేస్తున్నారు. గోపీచంద్ కు ఓపెనింగ్స్ వుంటాయా అన్నది అనుమానమే.అందువల్ల కనీసం బహ్మీని చూపించైనా కలెక్షన్లు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లుంది నిర్మాతలు.