‘ఆగడు’ సినిమా విడుదలై, కాస్త బ్యాడ్ టాక్ తెచ్చుకుని నాలుగు రోజులు గడిచిపోయింది. అయినా ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమాపై డిస్కషన్లు జరుగుతూనే వున్నాయి. ఏ ఇద్దరు సినిమా జనాలు కలిసినా ఇదే టాక్. ఆగడుకు ఖర్చు ఎంత అయింది అన్నదానిపై క్లారిటీ లేదు. అరవై నుంచి అరవై అయిదు కోట్లు ఖర్చయిందని టాక్ మాత్రం వ్యాపించింది.
ఈ విషయంలో శ్రీను వైట్ల కూడా మాట దాటేసారు కానీ అసలు సంగతి చెప్పలేదు. అయితే వాస్తవానికి ఈ సినిమాకు అయిన ఖర్చు నలభై అయిదు కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. అయితే పాత వ్యవహారాలు, అమ్మకపుస్ట్రాటజీలు చాలా వున్న కారణంగా అదనంగా చెప్పారని వినికిడి.స్టార్ కాస్ట్, డైరక్టర్ అన్నీ కలిపి ముఫై కోట్ల దాకా లాగేసిందని, నిర్మాణ వ్యయం పదిహేను మించి కాదని సినిమా చూసిన సినిమా జనం అంటున్నారు.
పైగా సినిమా చివరి దశలో నిర్మాతలు పెద్దగా డబ్బులు తీయలేదని టాక్ వుంది. ఆచంట బ్రదర్స్ ను అడిగితే అనిల్ అని, అనిల్ ను అడిగితే ఆచంట బ్రదర్స్ అని తప్పించుకున్నారన్న వదంతులు వున్నాయి. పైగా సినిమాలో ఒకటి రెండు పాటలు తప్ప పెద్దగా భారీతనం ఏమీ కనిపించలేదు. పోలీస్ స్టేషన్, బజార్ సెట్టతప్ప మిగిలినవన్నీ లోకేషన్లే. దానా దీనా 45 కు మించి అయి వుండదని, సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలు సేఫ్ అని అంటున్నారు.
ఎందుకంటే సినిమాకు శాటిలైట్ 13వరకు వచ్చింది. ఓవర్ సీస్ లో, నైజాంలో నిర్మాతలే స్వంతంగా విడుదల చేసుకున్నరు. నైజాంలో ఆసియన్ వారు సహాయపడ్డారు మాత్రమే అని కొనుకోలు చేయలేదని తెలుస్తోంది. నైజాం, ఓవర్ సీస్ కలెక్షన్లు మొదటి నాలుగు రోజులు బాగానేవున్నాయి. అందువల్ల అమ్మకాలు, అడ్వాన్సులు, ఇవన్నీ కలుపుకుంటే నిర్మాతలు సేప్ అని తెలుస్తింది. రిటర్న్ అగ్రిమెంట్ల సంగతి తెలియదు కానీ చాలా వరకు బాగానే అమ్మకాలు సాగించారని వినికిడి.