ఒక పక్క ఆగడు కలెక్షన్లు డల్ కావడం ప్రారంభమైంది. పైగా థియేటర్లు ఎక్కువ కావడం వల్ల టిక్కెట్లు ఈజీగా దొరుకుతున్నాయి. దాంతో సినిమాకు పెద్దగా కలెక్షన్లు లేవు అన్న టాక్ ప్రారంభమైంది. ఇలాంటి నేపథ్యంలో రవితేజ పవర్ సినిమా రెండో వారంలోకి ప్రవేశించింది.
ఇప్పుడు దాని కలెక్షన్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరింత ఫబ్లిసిటీ పెంచి, కాస్త హడావుడి చేస్తున్నారు. గొప్పసినిమా కాకపోయినా, కాలక్షేపానికి ఫరవాలేదు. దసరా సీజన్ కు సరిపోయే సినిమా అనే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది ప్లాన్. పైగా పవర్ కలెక్షన్లు మరీ సూపర్ గా కాకున్నా బి సి సెంటర్లలో ఆశాజనకంగానే వున్నాయి.