‘శివ’ శివా..ఈ సందేడేల ఇప్పుడు?

శివ సినిమా ఓ లాండ్ మార్క్. అయిపోయిన సంగతి. ఆ సినిమా పేరు పుణ్యమా అనే ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మను తెలుగునాట అభిమానించే జనం మిగిలివున్నారు. ఇప్పుడు శివ సినిమా ట్రయిలర్ ఒకటి…

శివ సినిమా ఓ లాండ్ మార్క్. అయిపోయిన సంగతి. ఆ సినిమా పేరు పుణ్యమా అనే ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మను తెలుగునాట అభిమానించే జనం మిగిలివున్నారు. ఇప్పుడు శివ సినిమా ట్రయిలర్ ఒకటి కొత్తగా ఫేస్ బుక్, యూ ట్యూబ్ ల్లో హడావుడి చేస్తోంది. పైగా శివపై డాక్యుమెంటరీ అని, అక్టోబర్ అయిదున విడుదల చేస్తామని ఓ మాట పడేసారు అందులో. 

అసలు అవసరమా ఇదంతా. నిజానికి శివ సినిమా ఈ జనరేషన్ లోని పదిహేను, ఇరవై ఏళ్ల మధ్య వయస్సున్న కుర్రాళ్లకు చూపించి, మా టైంలో ఇదో అద్భుతం అని చెప్పండి ఏముంది ఇందులో అంటారు. అది గ్యారంటీ. కానీ మాయాబజార్ కు అలా అనరు. కారణం ఆ జోనర్. ఇప్పుడు రావడం మానేసాయి కాబట్టి, అవే మైలురాళ్లుగా మిగిలాయి. 

కానీ శివను మించిన అనేకనేక సినిమాలు వచ్చేసాయి. టెక్నాలజీ పరంగా అప్పటికి అది సూపర్. ఇప్పుడు మరేవో సూపర్. కానీ ఇప్పుడు శివను పట్టుకుని దాని గురించి డబ్బా కొట్టాలనో, డాక్యుమెంటరీ తీయాలనో అనుకుంటే అనవసరంగా దానికి వున్న క్రెడిబులిటీ పోతుందేమో ఆలోచించాలి. ఇప్పటికే యూ ట్యూబ్ లో చూసిన జనాలు, ఆర్జీవీ ఆయన శిష్యబృందం ఖాళీగా వుండి కొత్త ట్రయిలర్లు చేయడానికి లేక, పాత సినిమాలకు ట్రయిలర్లు తయారు చేస్తున్నారని జోక్ లు వేస్తున్నారు. అవసరమా ఇదంతా?