కార్తికేయ ఫిక్సయ్యాడు

ఎప్పుడో సినిమా పూర్తి చేసుకుని, సెన్సారు సర్టిఫికెట్ చేతిలో వుంచుకుని కూడా తేదీ కోసం దిక్కులు చూస్తోంది కార్తికేయ. నిఖిల్, స్వాతి నటించిన ఈ సోషియో ఫాంటసీ సినిమాకు చందు దర్శకుడు. ఎక్కడ వారం…

ఎప్పుడో సినిమా పూర్తి చేసుకుని, సెన్సారు సర్టిఫికెట్ చేతిలో వుంచుకుని కూడా తేదీ కోసం దిక్కులు చూస్తోంది కార్తికేయ. నిఖిల్, స్వాతి నటించిన ఈ సోషియో ఫాంటసీ సినిమాకు చందు దర్శకుడు. ఎక్కడ వారం గ్యాప్ దొరుకుతుందా వద్దామని చూస్తుంటే, భారీ సినిమాలు తెరిపివ్వని వర్షంలా వచ్చి పడుతూనే వున్నాయి. 

ఆఖరికి ఇప్పుడు అక్టోబర్ 10 న రావాలని డిసైడ్ అయిపోయారు. లైలా వున్నా, కరెంటు తీగ వున్నా ఇంక అట్టే ముందు వెనుకలు ఆలోచించకుండా 10న వచ్చేయాలని డిసైడ్ అయిపోయారట. నిజానికి ఓ దశలో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ సకాలంలో విడుదల చేసుకోలేక, జనం మరిచిపోయేలా చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచీ పబ్లిసిటీ ప్రారంభించాల్సిందే.