మనోజ్ నటించిన సినిమా కరెంటు తీగ. తమిళ సినిమాకు రీమేక్ అన్న వార్తలు వుండనే వున్నాయి. పోరంబోకు కుర్రాళ్ల సంఘం అనే అర్థం వచ్చేలాంటి తమిళ సినిమాకు ఇది రీమేక్ కావచ్చు. తమిళంలో బిందుమాధవి వేసిన పాత్రను తెలుగులో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ చేసింది. ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. సోదరుడు మనోజ్ హీరోగా విష్ణు నిర్మించిన సినిమా ఇది.
ఈ సినిమా అక్టోబర్ రెండు విడుదల అన్న వార్తలు చాలా కాలం వినవచ్చాయి. కానీ ప్రస్తుతానికి ఏ హడావుడి వినిపించడం, కనిపించడం లేదు. గోవిందడు విడుదలకు రెడీ అవుతుందా,,కాదా అని వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గోవిందుడు లాంటి పెద్ద సినిమాపై ఎందుకు అన్న ఆలోచనలో యూనిట్ వున్నట్లు తెలుస్తోంది. ఒక వారం వదిలి రావాలని అనుకుంటున్నారట.
గోవిందుడు కు ఇంకా కొద్ది పాటి పని బ్యాలన్స్ వుంది. అందుకోసం వస్తుందా రాదా అన్న అనుమానాలు వున్నాయి. కానీ నూటికి నూరు శాతం 1న కచ్చితంగా వస్తామని నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్నారు. అంటే కరెంటు తీగ కాస్త ఆలస్యంగా వస్తుందనే అనుకోవాలి.