ఆమిర్ ‘బ్రాండ్’ దారుణంగా దెబ్బతిన్నట్టే..!

కోరి కెళుక్కోవడం అంటే ఇదేనేమో! తన పనేదే తను చూసుకోకుండా.. అనవసరమైన మ్యాటర్ లోకి తలదూర్చి.. ఏకంగా జాతి జనులందరినీ హర్ట్ చేశాడు ఆమిర్ ఖాన్. “అసహనం'' అంటూ తనలోని అసహనాన్ని చాటుకున్నాడు ఆమిర్.…

కోరి కెళుక్కోవడం అంటే ఇదేనేమో! తన పనేదే తను చూసుకోకుండా.. అనవసరమైన మ్యాటర్ లోకి తలదూర్చి.. ఏకంగా జాతి జనులందరినీ హర్ట్ చేశాడు ఆమిర్ ఖాన్. “అసహనం'' అంటూ తనలోని అసహనాన్ని చాటుకున్నాడు ఆమిర్. ఇంతకు ముందేమో కానీ ఇప్పుడు నిజంగానే ఆమిర్ ఖాన్ మీద అసహనం పెల్లుబుకుతోంది. ఒక పాయింట్ ను కాదు.. అనేక పాయింట్లను ఆధారంగా చేసుకుని ఆమిర్ ను జాడిస్తున్నారు జనాలు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఆమిర్ పై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. 

ఆయన మతమేదో చూడకుండా ఆదరించిన, అభిమానించిన వారందరినీ ఆమిర్ ఇప్పుడు హర్ట్ చేశాడు. టాప్ హీరోగా శిఖరంపై కూర్చోపెట్టిన వారిని ఆమిర్ అవమానించాడు. ఒకవైపు స్టార్ హీరోగా చెలామణి అవుతున్న దేశాన్నే తన మాటలతో అవమానించాడు. చలి మర గదుల్లో జీవించే ఆయనకు, ఆయన పిల్లలకు, భార్యకు ప్రమాదం వచ్చిపడిందని.. దేశంలో  హిందువులు తమను ఎక్కడ చంపేస్తారో.. అని ఆమిర్ వ్యక్తం చేసిన ఆందోళన తీవ్ర విమర్శల పాలవుతోంది. 

మరి ఆమిర్ ఖాన్ ఏమీ స్వతంత్ర సమరయోధుడు కాదు. సామాజిక కార్యకర్తనో… సంఘ సంస్కర్తో కాదు.. ఆఫ్ట్రాల్ ఒక సినిమా హీరో. సినిమాలు చేసి ఇమేజ్ ను , ఎండార్స్ మెంట్ తో ఆదాయాన్ని సంపాదించుకునే వ్యక్తి.  ఆయన బ్రాండ్ కు విలువ ఉన్నంత సేపే… ఆయనకు విలువ. ఆ బ్రాండ్ దెబ్బతింటే ఆయనను లెక్క చేసే నాథుడు ఉండడు. కళ్లు నెత్తికెక్కి ఆమిర్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఆ బ్రాండ్ కు ప్రమాదం వచ్చిపడుతోంది! ఆమిర్ మాటలు సగటు భారతీయుల్లో ఆయనపై అసహ్య భావాన్ని పెంచుతున్నాయి.  ఆ సగటు భారతీయులు ఇప్పుడు ఆమిర్ బ్రాండింగ్ ను.. ఆయన ప్రమోట్ చేసే సంస్థలను కూడా పక్కన పెట్టడం ప్రారంభించారు.

ప్రస్తుతం ఆమిర్ స్నాప్ డీల్ వంటి వాటికి అంబాసిడర్ గా ఉన్నాడు. ఆమిర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే అనేక మంది స్నాప్ డీల్ పై అసహనం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. నెటిజన్లు ఇచ్చే రేటింగ్స్ లో స్నాప్ డీల్ ఒక్కసారిగా “వన్ స్టార్ రేటింగ్'' స్థాయికి వచ్చింది. మరికొందరు నెటిజన్లు ఆమిర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. తాము ఆమిర్ అంబాసిడర్ గా చేసే వస్తువులను బహిష్కరిస్తాం అంటున్నారు.

కామెడీ ఏమిటంటే.. దేశంలో అసహనం ఎక్కువైందని అంటున్న ఆమిర్ .. ఇంటోలరెంట్ ఇండియా అంటున్న ఆమిర్.. “ఇంక్రెడిబుల్ ఇండియా'' కు ప్రచార కర్త.  దేశం ఔన్నత్యాన్ని చాటి చెబుతూ… టూరిజంను పెంపొందించే యాడ్స్ ల కనిపించే ఆయన ఇప్పుడిలా మాట్లాడాడు. నిజంగానే నైతికత అనేది ఉంటే ఆమిర్ ముందు ఆ యాడ్ ఫిల్మ్ లో కనిపించడం మానేయాల్సింది!