Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ అడ్వాన్స్ వెనక్కు తీసుకున్నారు

మహేష్ అడ్వాన్స్ వెనక్కు తీసుకున్నారు

సినిమా రంగంలో టాప్ పొజిషన్ లో వున్న హీరోలకు కోట్లకు కోట్లు అడ్వాన్స్ లు ఇవ్వడం, వాళ్లు డేట్ లు ఇచ్చేవరకు నిరీక్షించడం మామూలే. సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర ఇలాంటి అడ్వాన్స్ లు చాలా వున్నాయి. కానీ డేట్ లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అశ్వనీదత్ పాపం అలాగే వెయిట్ చేస్తున్నాడు. హారిక హాసిని రాధాకృష్ణ (చినబాబు)కూడా అంతే. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ కోసం దాదాపు 10-12 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. 

కానీ మహేష్ ఇదమిద్దంగా ఇప్పుడు డేట్లు ఇస్తా అని చెప్పడం లేదని తెలుస్తోంది. దాంతో వడ్డీలు తడిసి మోపడవుతున్నాయి. దీంతో రాధాకృష్ణ తాను మహేష్ కు ఇచ్చిన అడ్వాన్స్ ను అంచెలు అంచెలుగా వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు పది కోట్ల వరకు వెనక్కు తీసుకున్నారని, వుంటే ఒకటి రెండుకోట్లు మహేష్ దగ్గర వుండి వుంటుందని తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?