Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శ్రీనువైట్ల దగ్గర తడి ఇంకా వుందా?

శ్రీనువైట్ల దగ్గర తడి ఇంకా వుందా?

రామ్ గోపాల్ వర్మ ను ఎవరూ పట్టించుకోనపుడు ఆయన నవదీప్ తో సినిమాలు చేసాడు. నవదీప్ కు అదే గొప్ప..అంత పెద్ద డైరక్టర్ తనకు చాన్సిచ్చాడు అని. ఇప్పుడు టాలీవుడ్ లోని సెకెండ్ లైన్ హీరోలు ఇదే సంబరంలో వున్నారు. శ్రీను వైట్ల అనే డైరక్టర్ ఇన్నాళ్లు అందని పండు. 

టాప్ లైన్ హీరోలకు తప్ప, మరొకరికి చాన్స్ లేదు. అలాంటిది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్టర్లతో పాము నోట్లో పడి కిందకు జారిపోయాడు. దాంతో హమ్మయ్య, ఇప్పుడు ఇతగాడికి పెద్ద హీరోలు ఇక చాన్సివ్వరు. అందువల్ల మనకు అందుబాటులోకి వచ్చాడు అని సెకెండ్ లైన్ హీరోలు తెగ సంబర పడిపోతున్నారట. విష్ణు, నాగ చైతన్య, రామ్,

ఇలా వీరంతా శ్రీను వైట్లకు అవకాశం ఇవ్వడానికి రెడీగా వున్నారు. వీరిలో నాగచైతన్య అయితే ఏకంగా తనే స్వయంగా శ్రీను వైట్ల ఇంటికి వెళ్లి మరీ ఆఫర్ ఇచ్చి వచ్చాడట. పాపం, ఈ జూనియర్లంతా, శ్రీను వైట్ల దగ్గర తడి వుంది ఇంకా అని నమ్ముతున్నట్లుంది. అదే వుంటే..ఆగడు లాంటి అట్టర్ ఫ్లాప్ తరువాత రామ్ చరణ్ అవకాశం ఇస్తే, ముందు అర్జెంట్ గా దాన్ని ఫ్రూవ్ చేసుకుని, తన సత్తా నిరూపించుకునేవాడుగా..అలా చేయలేదు అంటే..ఏమనుకోవాలి..తడి అయిపోయిదనేగా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?