సాయి కొర్రపాటి నిర్మించిన సినిమా దిక్కులు చూడకు రామయ్యా. చిత్రమైన ఏంటీ సెంటిమెంట్ కాన్సెప్ట్ దీనిది. 19 ఏళ్లకే సెటిలైపోయి, పెళ్లి చేసుకున్న తండ్రి, తనకు 20 ఏళ్ల కొడుకు తయారయ్యాక, ప్రేమలో పడిన వైనం. ఈ పాత్రను అజయ్ చేస్తున్నాడు,. భార్యగా ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ నటిస్తోంది. ఇక వీళ్లు కొడుకుగా నాగశౌర్య నటిస్తున్నాడు.
కథలో అసలైన ఏంటీ సెంటిమెంట్ ట్విస్ట్ ఏమిటంటే తండ్రీ కొడుకులు ఒకే అమ్మాయిని ఇష్టపడడం, వెంటపడడం. దానికై గొడవ పడడం. ఎంత సాఫ్ట్ గా చెప్పినా అజయ్ అనే సరికి విలన్ వేషాలు, అదే లుక్ గుర్తుకు వస్తుందేమో అన్న అనుమానం టాలీవుడ్ జనాల్లో వ్యక్తమవుతోంది. ఇదే జగపతి బాబు అయితే ఫ్యామిలీ లుక్ వచ్చేదేమో అంటున్నారు. పైగా తండ్రీ కొడుకులు ఒకే అమ్మాయి కోసం వెంపర్లాడడం అంటే కాస్త ఏంటీ సెంటిమెంట్ గా వుంటుందేమో..ఎంత కామెడీగా చెప్పినా?