బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ కత్రినాకైఫ్ గత కొన్నాళ్ళుగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో పీకల్లోతు డేటింగ్‌లో వున్న విషయం విదితమే. ఇద్దరూ ఖరీదైన బంగ్లా కొనుక్కుని అక్కడే ‘సహజీవనం’ చేస్తున్నారంటూ గత కొన్నాళ్ళుగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
తాజాగా విన్పిస్తోన్న గాసిప్స్ ప్రకారం చూస్తే, రణ్‌బీర్‌కపూర్‌కి కత్రినాకైఫ్ షాకిచ్చిందని తెలుస్తోంది. పాత ప్రియుడు, తన కెరీర్‌ని గుర్రంలా పరిగెత్తించిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ వైపుకు కత్రినా దృష్టి మళ్ళిందట. ‘హిట్ అండ్ రన్’ కేసులో సల్మాన్‌ఖాన్ నిర్దోషిగా తేలే అవకాశముండడంతో కత్రినా ఈ నిర్ణయం తీసుకుందని బాలీవుడ్ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.
గతంలో కృష్ణ జింకల్ని వేటాడిన కేసులోనూ సల్మాన్‌ఖాన్ జైలుకి వెళితే, ఆ టైమ్‌లో సల్మాన్‌ఖాన్‌కి మానసికంగా ధైర్యాన్ని నూరిపోసింది కత్రినాకైఫ్. అయితే అనివార్య కారణావల్ల సల్మాన్, కత్రినా విడిపోయారు. మొన్నీమధ్యనే ఓ ఫంక్షన్‌లో ‘కత్రినా ఖాన్‌ని చేద్దామనుకున్నా.. కత్రినా కపూర్ అవుదామనుకున్నావ్..’ అని కత్రినాపై సల్మాన్ సెటైర్లు కూడా వేశాడు.
ఇంతలో ఏం జరిగిందో, రణ్‌బీర్ కపూర్‌తో ఎక్కడ చెడిందోగానీ, కత్రినాకైఫ్ కొద్ది రోజుల క్రితమే సల్మాన్‌ఖాన్‌ని కలిసిందనీ, తిరిగి స్నేహం కొనసాగించాలనుకుంటున్నట్లు సల్మాన్‌తో చెప్పిందనీ కొత్త గాసిప్స్ మొదలయ్యాయి బాలీవుడ్‌లో. నిజమేనా.? నిజమే అయితే కత్రినా బిగ్ యూటర్న్ తీసుకున్నట్టే.