అత్తారింటికి దారేది లో చివర ఇరవై నిమషాలు ఎమోషనల్ క్లయిమాక్స్ తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తిలో కూడా అదే చేస్తున్నాడట.
సినిమా చివరి అరగంట అదిరిపోతుందట. మానవ విలువలు, సంబంధాలు, ఇలాంటి వాటన్నింటినీ అక్కడ దట్టించి వదిలాడట. బ్యాడ్ లక్ ఏమిటంటే సెకండాఫ్ లో ఓ అరగంట కాస్త బోర్ కొడుతుందని.
అత్తారింటికి దారేది లో కూడా అదే కదా..ప్రీక్లయిమాక్స్ ముందు కాస్త బ్రహ్మానందం, అహల్య వంటి వ్యవహారలతో ప్యాచప్ చేసాడు. ఇందులోనూ అలాగే అన్నమాట. అంటే స్క్రిప్ట్ సెంటిమెంట్ వర్కవుటయితే, సినిమా సూపర్ హిట్టే.