‘రోబో-2’లో సూర్య.?

శంకర్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ సంచలన విజయం సాధించిన విషయం విదితమే. దానికి సీక్వెల్‌ రూపొందించే దిశగా ఇప్పటికే శంకర్‌ కథ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సీక్వెల్‌లో నటించేందుకు రజనీకాంత్‌ సంసిద్ధత…

శంకర్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ సంచలన విజయం సాధించిన విషయం విదితమే. దానికి సీక్వెల్‌ రూపొందించే దిశగా ఇప్పటికే శంకర్‌ కథ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సీక్వెల్‌లో నటించేందుకు రజనీకాంత్‌ సంసిద్ధత వ్యక్తం చేయలేదనీ, ఆ కారణంగా ‘రోబో`2’ కోసం శంకర్‌, సూర్య అయితే బావుంటాడని అనుకుంటున్నాడనీ తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతానికైతే శంకర్‌ పూర్తిగా ‘ఐ’ సినిమాపైనే ఫోకస్‌ పెట్టాడు. ఇటీవలే విడుదలైన ‘ఐ’ ట్రెయిలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై ఇదో అద్భుతం.. అనే స్థాయిలో ‘ఐ’ సినిమా ట్రెయిలర్‌ రూపొందిందన్న అభిప్రాయాలు దాదాపు అన్ని భాషల సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖుల నుంచీ విన్పిస్తున్నాయి.

ఇక, ‘రోబో`2’ విషయమై ఇప్పటిదాకా శంకర్‌గానీ, సూర్యగానీ పెదవి విప్పలేదు. తదుపరి ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడేంత టైమ్‌ ఇప్పుడు తనకు లేదంటూ శంకర్‌ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మరోపక్క, మహేష్‌ హీరోగా శంకర్‌ ఓ సినిమా తెరకెక్కించనున్నాడన్న ప్రచారం జరిగినా, అదంతా ఉత్తదేనని మహేష్‌ తేల్చేశాడు. చిరంజీవి కూడా శంకర్‌తో సినిమా చేయాలని ఉవ్విళ్ళూరుతున్నా, ఆ ప్రాజెక్ట్‌ కూడా వర్కవుట్‌ అయ్యేలా కన్పించడంలేదు.

ఇంతకీ, ‘ఐ’ తర్వాత శంకర్‌ కొత్త ప్రాజెక్ట్‌ ఏంటి.? అంటే, ‘ఐ’ విడుదల తర్వాతే శంకర్‌ ఈ విషయమై పెదవి విప్పే అవకాశం వుంటుందట. అప్పటిదాకా సస్పెన్స్‌ తప్పదు.