హీరో మహేష్ కెరియర్ మళ్లీ కాస్త ఒడిదుడుకుల్లో పడింది. ఇప్పటికీ నెంబర్ వన్ సూపర్ స్టార్ అనడంలో కానీ, సినిమా అంటూ వస్తే భయంకరంగా జనాలను ముందుగానే హై ఫీవర్ లా పట్టుకుని ఊపేయడంలో కానీ స్టామినా ఏమీ తగ్గిపోలేదు. అయితే ఎంతటి హీరోకైనా హిట్ అన్నది కొలమానమైపోతుంది. అందుకు ఒక్కటే దగ్గరి దారి. సరైన సబ్జెక్ట్ ఎన్నుకోవడం..సరైన నిర్ణయాలు తీసుకోవడం. మహేష్ ను ఇక్కడే ఓ భజన బృందం ప్రభావితం చేస్తోందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆగడు ఫలితం వచ్చిన తరువాత ఈ గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మహేష్ ఏ దర్శకుడితో చేయాలన్నది ఈ కోటరీ ప్రభావితం చేస్తోందని కుటుంబసభ్యులకు కూడా తెలుసని అంటున్నారు. కృష్ణ, నరేష్ తదితరులు ఈ విషయమై పలుసార్లు కొందరి దగ్గర కాస్త మాట్లాడినట్లు కూడా అంటున్నారు.
సినిమాలు త్వరగా చేయడం, బోయపాటి, వినాయక్ లాంటి మాస్ డైరక్టర్లను ఎంచుకోవడం కూడా అవసరమని సలహాలు వినిపిస్తున్నాయి. చిత్రంగా ఇప్పుడు కొరటాల శివ తరువాత మళ్లీ పూరి జగన్నాధ్ పేరే వినిపిస్తోంది. ఇలా ఒకే తరహా డైరక్టర్లను తరచు ఎంచుకుంటే కొత్తదనం రాదని అభిమానులు భావిస్తున్నారు.