మణిశర్మ-బాలయ్య అనగానే సమరసింహారెడ్డి, చెన్న కేశవరెడ్డి ఇలా చాలా సినిమాలు గుర్తుకువస్తాయి. బాలయ్య అనేంటీ..మహేష్, చిరంజీవి, పవన్ ఇలా చాలా మందికి సూపర్ డూపర్ మ్యూజిక్ అందించాడు. కానీ ఆ తరువాత యువ సంగీత కళాకారుల జోరుతో వెనకబడ్డాడు. దానికి తోడు ఒప్పకున్న సినిమాలు అలాంటివే..చిన్నా చితకా. పెద్దవి ఓకె సినిమా, మ్యూజిక్ మాత్రం..ఈ ట్యూన్లు మణిశర్మే అందించాడా అన్న అనుమానం కలిగేలా చేసాయి.
ఇప్పుడు తెలుగులో సరైన సంగీత దర్శకుల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. థమన్ ..సేమ్ టు సేమ్ అనే ముద్ర పడిపోయాడు. దేవీ ఫుల్ బిజీ.. అనూప్ పెద్ద సినిమాలకు గ్యారంటీ హిట్ మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు అందుకే మళ్లీ మణిశర్మ జనాలకు కనిపిస్తున్నాడు. బాలయ్య లయన్ సినిమాకు స్వరాలు అందిస్తున్నాడు. టిప్పు అనే కొత్త హీరో సినిమా టేకప్ చేసాడు. తమిళనాట రెండుసినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.
లయన్ అడియో తొమ్మిదన విడుదలవుతుంది. ఈ ఆడియో ఇప్పటికే విన్న యూనిట్ వర్గాలు, ట్యూన్ లు మళ్లీ పాత మణిశర్మను గుర్తుకు తెస్తున్నాయని, క్యాచీగా, చాలా బాగున్నాయని అంటున్నారు. నిజంగానే ఈ ఆల్బన్ హిట్ అయితే మణిశర్మ మళ్లీ ఫుల్ బిజీ అయిపోతాడు..అప్పడు కచ్చితంగా లయన్ ఈజ్ బ్యాక్ అనేసుకోవచ్చు.