హిట్టిచ్చిన దర్శకుడిని ఆదుకోనున్న అవసరాల, నాని?!

అవసరాల శ్రీనివాస్ “ఊహలు గుసగుసలాడే'' తర్వాత ఇతడి స్థాయి టాలీవుడ్ లో చాలా మెరుగైంది. సెన్సిబుల్ లవ్ స్టోరీలు తీయగల తెలుగు యువ దర్శకుడిగా అవసరాలకు మంచి పేరు వచ్చింది. అటు నటుడిగా కూడా…

అవసరాల శ్రీనివాస్ “ఊహలు గుసగుసలాడే'' తర్వాత ఇతడి స్థాయి టాలీవుడ్ లో చాలా మెరుగైంది. సెన్సిబుల్ లవ్ స్టోరీలు తీయగల తెలుగు యువ దర్శకుడిగా అవసరాలకు మంచి పేరు వచ్చింది. అటు నటుడిగా కూడా ప్రత్యేకతను కలిగి ఉన్న ఇతడి పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. 

నాని.. ఇప్పుడు ఇతడి స్థాయి వేరే చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి 'భలే భలే మగాడివోయ్'' తర్వాత ఇతడి రేంజ్ చాలా వరకూ పెరిగింది. ఆ సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ కావడంతో నాని కి ఇప్పుడు మంచి మార్కెట్ కూడా ఉంది. మరి ఒకనాడు ఒకే సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న వీళ్లిద్దరూ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. వీరద్దరికి లైఫిచ్చిన ఆ సినిమా పేరు “అష్టాచమ్మా''.

అంతే కాదు.. ఆసినిమాలో హిరోయిన్ గా నటించడం ద్వారా స్వాతి కి కూడా చాలా కలిసొచ్చింది. మరి వీరందరి సంగతిలా ఉంటే… ఆ సినిమా దర్శకుడిగా.. వీళ్లందరికీ లైఫిచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ పరిస్థితే ఏమంత బావోలేదు. అల్లరి నరేష్ హీరోగా నటించిన 'బందీపోటు' మూవీ మేకింగ్ సమయంలో మోహనకృష్ణ చాలా మందిని ఆకట్టుకోగలిగాడు. అయితే ఆ సినిమా విడుదల అయ్యి అది నిర్మాతగా నరేష్ కు కూడా నష్టాలనే మిగల్చడంతో ఆయనను పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. మరి ఇప్పుడున్న సమాచారం ఏమిటంటే… అటు నాని, ఇటు అవసరాల కలిసి.. ఇంద్రగంటి కి లైఫిచ్చే యత్నంలో ఉన్నారని సమాచారం. 

త్వరలోనే ఈ 'అష్టాచమ్మ' బ్యాచ్ కాంబోలో ఒక సినిమా రూపొందే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు నానినే స్టార్ అట్రాక్షన్ అని వేరే చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇంద్రగంటితో కూడా సినిమాలు చేయడానికి ఏ నిర్మాత ముందుకు రావడం లేదు. అయితే నాని డేట్స్ గనుక ఇంద్రగంటి చేతిలో ఉంటే.. సినిమా కచ్చితంగా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ విధంగా నాని.. తనకు మరపురాని హిట్ ఇచ్చిన ఇంద్రగంటితో మళ్లీ కలిసి పనిచేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాకా నాని-ఇంద్రగంటి కాంబోలో సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయి.