ఒకవైపు ఇండియన్ టీవీ చానల్స్ లో ఇంకా సాస్ బహూ కహానీలే అట్రాక్టివ్ సబ్జెక్టులుగా నడుస్తున్నాయి. హిందీలో టాప్ రేటింగ్ సీరియల్స్ కాన్సెప్టులన్నీ అత్తా కోడళ్ల గొడవల గురించినే ఉంటున్నాయి. క్యొంకీ సాస్ కభీ బహూ థీ.. నాటి కథ, కథనాలనే ఇంకా కొనసాగిస్తున్నారు. అవే సీరియళ్లను దక్షిణాది చానళ్ల వాళ్లు కూడా డబ్బింగ్ చేసి జనాల మీదకు వదులుతున్నారు. ఆడవాళ్లను ఆకట్టుకునే ఆ సబ్జెక్టుల మీద సీరియల్సే అనుకొంటే… తాజాగా ఒక హిందీ చానల్ ప్రసారం చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ తరహా ప్రోగ్రామ్ వివాదాలు సృష్టిస్తోంది.
దీని విడియో పుటేజీలు హాట్ హాట్ గా ఉన్నాయి. ఒక విదేశీ నెట్ వర్క్ కు చెందిన పాపులర్ హిందీ చానల్ దాన్ని ప్రసారం చేసింది. కథానుసారం లెస్బియన్ సెక్సువల్ యాక్టివిటీస్ ను చూపించారు అందులో. ప్రకృతి విరుద్ధమైన ఆ సెక్సువల్ యాక్టివిటీ పట్ల ఆసక్తిని చంపుకోలేని ఒక అమ్మాయి తన సరదా తీర్చుకోవడం గురించి ఎలా వ్యవహరించింది… ఆమె తీరును అర్థం చేసుకొన్న బాయ్ ఫ్రెండ్ ఎలా వ్యవహరించాడు… అనే కాన్సెప్ట్ తో ఆ ప్రోగ్రామ్ సాగిపోతుంది.
మరి లెస్బియన్ యాక్టివిటీస్ ను ఇది వరకూ కొన్ని భారతీయ సినిమాల్లో చూపించారు. అవి పెద్ద పెద్ద వివాదాలయ్యాయి. అయితే ఇప్పుడు ఏకంగా చిన్నితెర మీద కూడా ఇలాంటి కాన్సెప్టుల మీద కార్యక్రమాలు, టెలీఫిల్మ్ లు రావడం అంటే.. ఇది గొప్ప డెవలప్ మెంటే. మనోళ్లు ఇంకా సాస్ బహూ కాన్సెప్ట్ల దగ్గరే కాదు.. లెస్బియన్ యాక్టివిటీస్ ను చూపించడం వరకూ వెళ్లిపోయారు.. అనుకోవాల్సి వస్తోంది. విశేషం ఏమిటంటే.. ఆ చానళ్ వారిపై ఎవరూ రెచ్చిపోవడం లేదు. ఇంటిళ్లిపాదీ చూసే టెలివిజన్ లో అలాంటి ప్రోగ్రామ్స్ వేయడం ఏమిటి? అంటూ విమర్శించడం లేదు. బహుశా అందరూ ఆ స్థాయి ప్రోగ్రామ్స్ మామూలే అనుకునే స్థాయికి డెవలప్ అయ్యారు కాబోలు!