సినిమాలకు టైటిళ్ల సమస్య ఇంత అంతా కాదు. నిన్నటి నిన్న బాలయ్య లయన్ టైటిల్ కోసం కిందా మీదా పడ్డారు. ఇప్పుడు టైగర్ వంతు వచ్చింది. సూపర్ టైటిల్ పెట్టేసి, సినిమా సగం హిట్ కొట్టేసాడు సంపత్ నంది అనుకున్నారంతా బెంగాల్ టైగర్ టైటిల్ విని. రవితేజ సినిమాకు సూపర్ గా వుంటుందనుకున్నారు.
అయితే అంతలోనే మరో టైగర్ అప్పటికే లైన్లో వుందని తెలిసింది. అది సందీప్ కిషన్ టైగర్. ఇప్పటికే దాదాపు పూర్తి కావచ్చింది. బెంగాల్ టైగర్ ముందుగా రిజిస్టర్ అయింది. టైగర్ ముందుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. బెంగాల్ టైగర్ ఇంకా సెట్ మీదకే వెళ్లలేదు.
అందువల్ల ఇద్దరి వాదనా సబబే..అందుకని ఎవరి టైటిల్ తో వారు ఆ విధంగా ముందుకు వెళ్లిపోవడమే.