‘నన్ను ఇంతగా అభిమానిస్తోన్న మీకోసం ఓ హిట్ సినిమా చెయ్యాలని దేవుడ్ని కోరుకున్నా..’ అని ‘గోపాల గోపాల’ సినిమా ఆడియో విడుదల వేడుకలో పవన్ వ్యాఖ్యానించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ప్రస్తుతం జనసేన పార్టీకి అధినేత. ఇటీవలే ఎన్నికల సంఘం ఆ పార్టీకి గుర్తింపు కూడా ఇచ్చిన దరిమిలా, పవన్ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాల్సి వుంది. ఆ కారణంగానే పవన్ ఇకపై రాజకీయాలకు దగ్గరగా, సినిమాలకి దూరంగా వుంటాడనే ప్రచారం జరిగింది.
అయితే, ఇంకా తాను మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు పవన్ చెప్పకనే చెప్పేశాడు ‘గోపాల గోపాల’ ఆడియో విడుదల వేడుకలో మాట్లాడుతూ. ‘గబ్బర్‌సింగ్`2’ తర్వాత చేయబోయే సినిమాకి అనూప్ రుబెన్స్ సంగీత దర్శకుడని పవన్ ప్రకటించాడంటే, పవన్ ఈ ఏడాది రెండు సినిమాల్ని ఖచ్చితంగా చేస్తాడనే కదా.
‘గోపాల గోపాల’ విడుదలయ్యాక పవన్ పూర్తిగా ‘గబ్బర్‌సింగ్`2’పై ఫోకస్ పెడ్తాడు. ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా చేస్తాడు. దానికి అనూప్ సంగీతం. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘కోబలి’ అనే ప్రాజెక్ట్ ఒకటి ఎప్పటినుంచో వార్తల్లో నిలుస్తోంది. అది కూడా సెట్స్‌మీదకు ఈ 2015 చివర్లోనో లేదంటే 2016లోనో వచ్చే అవకాశమూ లేకపోలేదు.
మొత్తమ్మీద, పవన్ కెరీర్‌లో మరిన్ని సినిమాలైతే చేయాలని ఫిక్సయ్యాడన్నమాట. పవన్ అభిమానులకు ఇంతకన్నా హ్యాపీ న్యూస్ ఇంకేముంది.? ఇప్పటినుంచి పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెట్టడం కన్నా, సినిమా కెరీర్‌లో ఓ పక్క కొనసాగుతూ, ఈ నాలుగేళ్ళలో పార్టీని జాగ్రత్తగా బిల్డప్ చేసుకోవడం మంచి ఐడియానే. అయితే పవణ్, ఈ విషయంలో ఎంత ప్లానింగ్‌గా వెళ్తాడన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే.