వరల్డ్ కప్ అయిపోయినా.. వాళ్ల లొల్లి అయిపోలేదు!

ఆట గోరంత అయితే.. అతి కొండంత అన్నట్టుగా ఉందని బంగ్లాదేశ్ వాళ్ల తీరు. ప్రపంచకప్ లో తొలి సారి క్వార్టర్ ఫైనల్స్ వరకూ వచ్చి.. చాలా అద్భుతాన్ని సాధించేశాం.. ఇక ప్రపపంచకప్ నే మా…

ఆట గోరంత అయితే.. అతి కొండంత అన్నట్టుగా ఉందని బంగ్లాదేశ్ వాళ్ల తీరు. ప్రపంచకప్ లో తొలి సారి క్వార్టర్ ఫైనల్స్ వరకూ వచ్చి.. చాలా అద్భుతాన్ని సాధించేశాం.. ఇక ప్రపపంచకప్ నే మా చేతిలో పెట్టేయాలన్నట్టుగా వ్యవహరించేస్తోంది బంగ్లాదేశ్. క్రీడాకారులు, రాజకీయ నేతలు తేడా లేకుండా అందరూ ప్రపంచకప్ లో తమ జట్టు మోసపోయిందని మాట్లాడారు. 

ఇండియాతో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చిన బంతి నో బాల్ అంటే.. బంగ్లాదేశ్ ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. అది నిజంగానే నోబాల్ కాకపోయి, శర్మ ఆ బంతికే ఔట్ అయినా.. బంగ్లా విజయం సాధించేదేమీ ఉండదు. అయితే బంగ్లాదేశ్ ప్రదానితో సహా అందరూ అది నోబాల్ అని మొత్తుకొంటారు.

ఆ వివాదంపై తను  కూడా ఒక సగటు బంగ్లాదేశీలాగానే మాట్లాడాడు ముస్తాఫా కమల్. ఈయన ఐసీసీకి అధ్యక్ష హోదాలోఉన్నాడు. మరి ఆ స్థాయి వ్యక్తి కూడా తమ దేశ టీమ్ క్వార్టర్స్ లో ఓడిపోగానే.. అది నో బాల్ అంటూ అందుకొన్నాడు. అంతేగా అంపైరింగ్ తప్పిదాల గురించి విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశాడు. మరి ఐసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం సబబు కాదు కదా! దీంతో.. ఈయనను ప్రపంచకప్ ఫైనల్ లో ట్రోఫీ బహుకరించే సెర్మనీకి దూరం పెట్టారు!

దీంతో ఆయనకు కోపం వచ్చింది. అది అన్యాయం.. ప్రపంచకప్ ను అందించడం అనేది నా హక్కు. నాకు జరిగిన అన్యాయం గురించి ప్రపంచానికి వివరిస్తా.. అని అంటున్నాడు. మరి మొత్తానికి బంగ్లాదేశ్ తీరు కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా ఉంది. క్వార్టర్స్ వరకూ వచ్చిన జట్టు ఓటమికి సమాధానంగా భారత్ ను దోషిగా చూపడం, ఐసీసీని తప్పుపట్టడం.. వంటి వివాదాలతో ఆనందిస్తోంది. ఇదైతే సరైన పద్ధతి కాదు.