ఎమీ..ఏమిటీ పని?

ఎమీ జాక్సన్..ఖాతాలో ఒక్క హిట్ లేదు. తొలి చిత్రం మదరాసు  పట్టణం, మలి చిత్రమైన ఏక్ దీవానా థా ( ఏమాయ చేసావే హిందీ వెర్షన్) రెండూ ఏవరేజ్ సినిమాలే. తెలుగులో ఎవడు కాస్త…

ఎమీ జాక్సన్..ఖాతాలో ఒక్క హిట్ లేదు. తొలి చిత్రం మదరాసు  పట్టణం, మలి చిత్రమైన ఏక్ దీవానా థా ( ఏమాయ చేసావే హిందీ వెర్షన్) రెండూ ఏవరేజ్ సినిమాలే. తెలుగులో ఎవడు కాస్త బెటర్. 

చేసినవి, చేస్తున్నవి పెద్ద సినిమాలే కానీ, హిట్ లు  అన్నవి ఇప్పటి దాకా లేవు. వుంటే గింటే శంకర్ తో చేస్తున్న ఐ మాత్రమే ఆ జాబితాలో చేరుతుంది. అలాంటి నటి ఎలా  వుండాలి..ఏ ఆఫర్ వచ్చినా గంతేసి ఒప్పుకోవాలి. కానీ ఎమీ అలా కాదట..సోలో హీరోయిన్ పాత్రల కోసమే చూస్తోందట. సూర్య పక్కన సెకెండ్ హీరోయిన్ గా అడిగితే నో అనేసిందట.

 నయన తార కూడా ఈ సినిమాలో నటిస్తుండడమే ఇందుకు కారణం అంట. ముందు ఓకె అని, తీరా నయన్ వుందని తెలిసాక నో అందిట. సూర్య పక్కన చాన్స్ అన్నపుడు ఫస్ట్ అయితేనేంటి..సెకండయితేనేంటి..మరీ పాత్ర బాగులేకుంటే అది వేరే సంగతి. ఏమిటో ఎమీ?