బాలకృష్ణ లేటెస్ట్ మూవీ లయన్. నూతన సంవత్సరం సందర్భంగా టీజర్ విడుదలై, అభిమానులను అలరించింది. నందమూరి వారసులు ముగ్గురు తమ తమ సినిమాల టీజర్లు, ట్రయిలర్లు ఒకేసారి విడుదల చేసారు. వీటిలో అగ్రస్థానం లయన్ కే దక్కింది. బాలయ్య లయన్ తరువాతి స్థానం కళ్యాణ్ రామ్ పటాస్ దక్కించుకుంది. ఎన్టీఆర్ టెంపర్ టీజర్ అంతలా ఆకట్టకులేదు.
అయినా అభిమానులు మౌనంగా వున్నారు. ఇక్కడ సంగతేంటంటే, పటాస్ సినిమా పూర్తయింది. టెంపర్ ఎనభై శాతం పూర్తయింది. సినిమాల్లోని మంచి డైలాగ్, మంచి సీన్ ఇలాంటివే టీజర్ లో ట్రయిలర్లలో పెడతారు. మరి దాదాపు పూర్తయిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సినిమాలకన్నా, కేవలం నలభై శాతం మాత్రమే పూర్తయిన బాలయ్య టీజర్ అలరించడం విశేషం.
పైగా అసలు విషయం ఏంటంటే బాలకృష్ణ రెండో గెటప్ ఇంకా చిత్రీకరించాల్సి వుంది. ఇది చాలా హైలైట్ అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య గడ్డం పెంచుతున్నది ఈ పాత్ర కోసమే. అది కూడా పూర్తయ్యాక ట్రయిలర్ కట్ చేస్తే, అది ఓ లెవెల్ లో వుంటుందంటున్నారు. ఏమైనా సీనియర్ సీనియరే.