గుండెల్లో గోదారి, ఉలవచారు బిర్యానీ, గాయం 2, ధోని, ఓం శాంతి, మల్లెపువ్వు, ఎటో వెళ్లిపోయింది మనసు.. ఈ సినిమాలన్నింటికి రెండు లింక్ లున్నాయి..అన్నీ పెద్దగా ఆడని సినిమాలే..మరో లింక్ వీటన్నింటికీ సంగీతం ఇళయరాజానే.
ఒక విధంగా ఇళయరాజా సెకెండ్ ఇన్నింగ్స్ అనుకునే ఇటీవల అయిదు పదేళ్లలో ఇళయరాజా సంగీతం అందించిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు. శ్రీరామరాజ్యం, రుద్రమదేవి కాస్త మినహాయింపు..అది కూడా పూర్తిగా కాదు. ప్రస్తుతం ఇళయరాజా చేతిలో రెండు తెలుగు సినిమాలు వున్నాయి.
నిజానికి సినిమా విజయం, పరాజయం అన్నది ఏ ఒక్కరి వల్లనో కాదు. పైగా మ్యూజిక్ డైరక్టర్ వల్ల సినిమా హిట్ కావడం వుంటుంది కానీ ఫ్లాప్ కావడం వుండదు. అయితే టాలీవుడ్ అంటేనే సెంటిమెంట్ల పుట్ట.సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహమాన్ కు కూడా ఓ సెంటిమెంట్ వుంది. ఆయన తెలుగులో నేరుగా చేసిన సూపర్ పోలీస్, కొమరం పులి, నాని అన్నీ డిజాస్టర్లే.
ఇలాంటపుడే కొన్ని నమ్మకాలకు లాజిక్ లు వుండవు అనిపిస్తుంది,.